Sunday 13 July 2014

RGV- Ice Cream

ఈ మద్య కాలంలో వచ్చిన గెట్టి కథా బలం ఉన్న సినిమాల్లో "ఐస్ క్రీం" ఒకటి.
ఈ మద్య కాలంలో వచ్చిన RGV గారి సినిమాలు అన్నిటి కంటే ఈ "ఐస్ క్రీం" గొప్ప సినిమా అనిపించింది.
ఈ మద్య కాలంలో వచ్చిన అర్ధవంతమైన సినిమా టైటిల్స్ లో "ఐస్ క్రీం" ఒకటి. అది ఎలానో తెలియాలి అంటే ముందు మనం రెండు విషయాలు తెలుసుకోవాలి.

(1) నిద్ర పోయేముందు ఐస్ క్రీం ఎక్కువుగా తింటే పీడ కళలు వస్తాయి.
(2) ఈ సినిమా "కలలో కనపడేదానికి, కళ్ళ ముందు కనపడేదానికి తేడ తెలుసుకోలేనంత మెంటల్ డిసార్డర్ లో ఉన్న ఒక అమ్మాయి చుట్టూ జరిగిన యదార్ధ సంగటనల  నుంచి తయారు చేయబడింది.

ఐస్ క్రీం సినిమా చూసి అర్ధం చేసుకున్న ఎక్కువ శాతం మంది ఆ సినిమాకు ఐస్ క్రీం గొప్ప టైటిల్ అని అంగీకరిస్తారు. చూడని వాళ్ళు ఇదేమి చెత్త టైటిల్ రా బాబు అనుకుంటారు, ఎందుకంటే నేను చూడకముందు అలానే అనుకున్న....

కథ గురించి మాట్లాడుకునే ముందు రెండు విషయాలు:

(1)దేవుడిని నమ్మని వారి సంగతి ఏమో గాని, దేవుడిని నమ్మే ప్రతి ఒక్కరు దెయ్యాన్ని నమ్మవలసిందే!!మన దేవుల్లో ఎక్కువ సేతం మనిషిగా పుట్టి మరణించిన వారే. మన జాతికి మంచి చేసి మరణించిన వారు దేవుడైనప్పుడు చెడు చేసి మరణించిన వాడు దెయ్యమే కదా... దేవుడు ప్రతి చోటా ఉన్నట్టు దెయ్యము ప్రతి చోటా ఉంటుంది కదా. కాకపోతే మనలోని ధైర్యం, దైవత్వం, దెయ్యాన్ని దూరంగా పెడుతుంది... దేవుడి దయ పొందటానికి కొన్ని పద్దతులు (పూజలు, వ్రతాలు) ఎలా ఫాలో అవుతామో దెయ్యాన్ని దూరం పెట్టటానికి దిష్టి బొమ్మ, నిమ్మ కాయలు, తాడు లాంటివి ఎన్నో ఫాలో అవుతాము.

(2) దెయ్యాన్ని నమ్మి దాన్ని నుంచి బయటపడే మార్గాలు అన్వేసిన్చేవారు ఒక రకం... దెయ్యాన్ని నమ్మకుండా దాని సంగతి తెల్చాలనే వారు మరో రకం...ఇంకో రకం ఉంది, వారే ఈ కథకు మూలం: దెయ్యాన్ని గెట్టిగా నమ్మలేరు, అట్లా అని చెప్పి పూర్తిగా ఇవి ఉండవంటు కొట్టి పారేయను లేరు...  వీరికుండే ప్రదాన శత్రువులు రెండు.
(అ) వీరికి భయాన్ని కలిగించే సంగటనలు జరగటం...
(ఆ) వీరి భయానికి అర్ధమే లేదంటూ వీరికి ధైర్యం చెప్పేవారు ఉండటం...
 ఈ రెండు విషయాలు వాటి ఫలితాలు చాలా స్పష్టంగా ఐస్ క్రీం సినిమాలో చూపించారు రామ్ గోపాల్ వర్మ గారు...

ఈ "ఐస్ క్రీం" సినిమా లో హీరోయిన్ భయపడటానికి కారణాలు:
  1. అప్పుడే హారర్ సినిమా చూసి రావటం
  2. ఆ ఇంటికి దుష్ట శక్తుల నుంచి రక్షణ కలిపించే బొమ్మను హీరో కాలితో తన్నటం
  3. కొత్తగా వచ్చిన అంత పెద్ద ఇంట్లో ఇప్పుడ తను ఒక్కతే ఉండబోవటం
  4. ఐస్ క్రీం బాగా తినటం వళ్ళ అయ్యివుండవచ్చు, లేక పైన మూడు విషయాలవల్ల అయ్యీ ఉండవచ్చు, తనకు దారుణమైన పీడ కళలు రావటం..
  5. కలలోకి వచ్చింది కళ్ళముందు కనపడటం, కళ్ళ ముందే కలలోకి వెళ్ళటం...కల ఏదో నిజమేదో తెలుసుకోలేనంతగా ఒక దాని తర్వాతా ఒక సంఘటన జరగతూ ఉండటం...
  6. మొదట్లో హీరో కావాలని భయ పెట్టటటం, ఆ తర్వాతా ఆమె భయానికి లాజికల్ రీసన్ చెప్పుకుంటూ ఆమె కలలోకి వస్తుంది ఆమె కళ్ళ ముందే జరుగుతునట్టు అనిపిస్తుంది తప్ప అది నిజం.....

ఇంక చాలు మిగతాది మీరు సినిమాలో చూడండి.. ఇంకో విషయం మన ప్రేక్షకులు చాలా తెలివి కలవారు కాబట్టి మన రామ్ గోపాల్ వర్మ గారు ఈ సినిమలో చాల మంది ఫాలో అయ్యే "అరటి కాయి వలచి నోట్లో పెట్టిన విదంగా" కాకుండా చాల గొప్పగా ప్రేక్షకుడు ఆలోచించే  విదంగా స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ అద్బుతంగా అందించారు... 

ఈ సినిమాలో చూపించిన మెంటల్ డిసార్డర్ పాయింట్  ని "బారి బడ్జెట్" తో చూపించవచ్చు, ఈ ఐస్ క్రీం సినిమా లా "లో బడ్జెట్ " తో చూపించవచ్చు... ఒక ప్రేక్షకుడిగా నాకు ఈ ఐస్ క్రీం సినిమా బాగా నచ్చింది, సినిమా ఆద్యంతం నన్ను భయపెట్టింది, నాకు ధియేటర్ లో కూర్చున్న సమయం వ్రుదా కాలేదు అనే ఒక సంతృప్తి వచ్చింది. ఇంక బడ్జెట్, కలెక్షన్స్ విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ గారు చెప్పిన ప్రకారం "ఐస్ క్రీం కి మేము పెట్టిన ఖర్చెంతంటే కేవలం ఒక్క రోజు కలెక్షన్లతో ప్రొడ్యూసరు,డిస్ట్రిబ్యూటర్లు వాళ్ల పెట్టుబడి రికవర్ చేసుకున్నారు." ఇది బాక్స్ ఆఫీసు హిట్ సినిమానే!!

చివరిగా ఇంకో విషయం....

"నేను ఐస్ క్రీం లో ఇంట్రొడ్యూస్ చేసిన హై కాన్సెప్ట్-లో బడ్జెట్ ప్యారెలల్ సినిమా గాని, గింబల్ రిగ్ గాని ఎప్పటికీ ఉండిపోతాయి. దీనికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను."- రామ్ గోపాల్ వర్మ

ఈ హై కాన్సెప్ట్-లో బడ్జెట్ సినిమాలు మన ఇండస్ట్రీ కి ఎంతో అవసరం, నాకు అర్ధమైనన్థవరకు ఈ "ఐస్ క్రీం" సినిమాలో హై కాన్సెప్ట్ ఉంది అని నా ఫీలింగ్ కాకపోతే అది ఎంత మందికి అర్ధం అయ్యింది అనేది నేను చెప్పలేను...

Navadeep feeling very happy and proud for you on acting in RGV sir film, thanks a lot.
RGV AACHARYA, thanks for giving one more movie in the name of “Ice Cream”.



Tuesday 17 December 2013

ఆయని 'నా ఇష్టం' లో నా ఇష్టం - 5


                                                           ‘నేను అనే రాంగోపాల్ వర్మ 

రాంగోపాల్ వర్మ  గారి "నా ఇష్టం" పుస్తకం లో ఏవిధంగా "నేను" నేనయ్యాను అంటూ ఆయన ఆయనగా అవ్వటానికి మూల కారణాలు చెప్పారు. నావరకు "నేను" అనే రాముగారి గురించి రాము గారు చెప్పుకున్న సమాచారం చాల చాల అమూల్యమైనది. ఎందుకంటే, నా ఆలోచనలకూ రాము గారు ఒక ఇంధనం. ఆయని ఆలోచనలు, మాటలు, పనులు నాకు చాలా ఉపయోగపడుతున్నాయి. నాకే కాదు, నాకంటే గోప్పవారికి కూడా రాము గారు ఎంతో కిక్ ఇస్తున్నారు.

ఒక మనిషి యొక్క ఆలోచనలు తెలుసుకొవాలనే కుతూహలమ్, ఒక మనిషితో ఆలోచనలు పంచుకోవాలనే ఆత్రం, ఒక మనిషి వద్ద పని, జీవితం నేర్చుకోవాలనే తాపత్రయం మనకి ఎందుకు కలుగుతుంది అంటారు.....

ü  మన ఆలోచనలు ఆయని ఆలోచనలు ఒకటై ఉండిఉండాలి

ü  మనం చేయాలనుకుని చేయలేకపోయేవి ఆయన చాలా అద్బుతంగా చేస్తూ ఉండి ఉండాలి.

ü  మన ఆలోచనల మీద భరోసా కలిగించేలా వారి ఆచరణ ఉండిఉండాలి.

ü  ఆయన నుంచి మనకి ఎన్నో ఉపయోగించుకునే సంగతులు తెలుస్తూ ఉండి ఉండాలి

ü  ఆయనవల్ల మనకి ఎన్నో లాభాలు వస్తు ఉండివుండాలి

ü  ఒక వేల వారి వళ్ల మనకి క్షణంలోనైన ఆపద వాటిల్లుద్ది అనుకున్న, వారి వారి ఆలోచనలను నిత్యం మనం గమనిస్తూఉండాలి :)

ఇది సరే, అసలు రాము గారి నుంచి నాకు నచ్చి నేను తీసుకుంటుంది ఏంటి..

ü  ఆయన పలికే మాట మీద, చేసే పనిమీద అద్బుతమైన స్పష్టత ఉండటం.

ü  రవి కాంచని చోటు కవి కాంచెను అంటారు, కాని కవి కూడా చూడలేని చోటుని మన RGV  గారు చూడగలరు; ఆయన ఎవ్వరూ ఆలోచించలేని కోణాలనుంచి ఆలోచిస్తారు.

ü  24 గంటల్లో, 21 గంటలు సినిమా పనిలోనే ఉంటారు, ఈయన నిత్యం తన మెదడుకి పని చెబుతూనే ఉంటారు. నిద్రపోయే రెండు మూడు గంటల్లో వచ్చే కలను కూడా సినిమా కథలుగా మారుస్తారేమో!!

ü  సమయాన్ని వృధా చేయించే వాటి మీద ఆయనకి అద్బుతమైన కంట్రోల్ ఉంటుంది.

ü  ఆయన చేస్తున్న పనిలో కొత్త ప్రమాణాలు తీసుకోస్తుంటారు

ü  ఎంత కష్టమైన, అర్ధంకాకపోయిన , కాంట్రావెర్సి అయ్యే సబ్జెక్టు అయ్యిన సరే అది ఆయన చాలా గొప్పగా మలచి మన ముందు ప్రదర్శిస్తారు.

ü  ఆయన చేయాలనుకున్న పనిని చాలా అద్బుతమైన ప్రణాళికతో సాదిస్తారు.

ü  ఎదుట వ్యక్తిలో ఆయనకి నచ్చిన ఆలోచనలని వారి స్థాయితో, వయసుతో సంబందం లేకుండా స్వాగతిస్తారు.

ü  ఆయన చెప్పాలనుకుంది నిక్కసుగా, నిర్భయంగా చెబుతూనే వాటివల్ల ఎదురవుతున్న సమస్య నుంచి కూడా తన సమాధానాన్ని ప్రమోట్ చేస్తారు.

ü  ఇంజనీరింగ్ చదివారు, ఇంట్లో పనులకు భాద్యత తీసుకున్నారు, సినిమా డైరెక్టర్ అయ్యారు, నిర్మాత అయ్యారు, అద్భుతాలు సృష్టించారు, సృష్టిస్తూనే ఉన్నారు, ముందు ముందు ఇంకా ఎన్నో సృస్టిస్తారు.

ü  ఆయని సినిమాలో ఎమోషన్స్ ని చుపించినంతగా ఇంకెవ్వరు చూపించలేరేమో.

ü  ఆయని శ్రద్ధ, సహనము నాకు అమితమైన ఇష్టం . 

రాము గారి మీద నా లెక్కను కొంచం పక్కన పెడుదాం. ప్రముక రచయిత సిరా శ్రీ గారి "వోడ్కా విత్ వర్మ"  బుక్ వళ్ళ రాము గారిని ఇంకొంచం దగ్గరగా చూడగలిగాము. ఇందులో ప్రముఖులు రాము గారి మీద ఉన్న వారి అభిప్రాయాన్ని చెప్పింది చదివిన తర్వాతా, నాకు రాము గారు అందలేనంత దూరం లో ఉన్నారని నేను ఆయన గురించి తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అని అనిపించింది.
కింది సమాచారాని అందించిన సిరాశ్రీ  గారికి ఎంత కృతజ్ఞత చుప్పుకున్న అది తక్కువే అని వారికి మేము సదా కృతజ్ఞులమై ఉంటామని తెలియ చేసుకుంటూ "వోడ్కా విత్ వర్మ" పుస్తకం లోని కొంత జ్ఞానాన్ని(ప్రముఖులు రాము గారి గురుంచి చెప్పిన కొన్ని మాటలను) నాకోసం ఇక్కడ రాసుకుంటున్న .

----------------------- పూరి జగన్నాథ్ గారు -------------------

ü  రామ్ గోపాల్ వర్మ అంటే నాకొక క్రేజ్... నా లైఫ్ లో  సూపర్ స్టార్ అంటే ఆయనే.

ü  ఆయన్ని కలిసిన, మాట్లాడినా, అఖరికి ఆయన నుంచి మెసేజ్ వచ్చిన పొంగిపోతాను. ఇరవై యెల్లూ గడిచిన క్రేజ్  ఇంకా తగ్గలేదు. పైగా పెరుగుతూనే ఉంది.

ü  నేను ఆయనలో చూసినంత clarity మనిషిలోను చూడలేదు. ఆయనలో చుసిన Honesty నేను ఎవరిలోనూ చూడలేదు.

ü  ఈయనున్నాడనే ధైర్యంతో Ayn Rand ని చదవటం మానేసాను.

ü  రామ్ గోపాల్ వర్మ తనని కలిసిన వారిని ఎవరినైనా Educate చేస్తాడు లేదా Thrill చేస్తాడు లేదా Disturb చేస్తాడు... మూడిటిలో ఏదో ఒకటి చేయకుండా ఎవడ్ని వదిలిపెట్టడు.

ü  ఆయనకున్న సినిమా పిచ్చితో పోలిస్తే మాకెవ్వరికి సినిమా knowledge కుడా లేనట్టే. ఆయనతో ఎన్ని రోజులు మాట్లాడిన ఆయన మాటల్లో సినిమానే ఉంటుంది. సినిమాలో జీవితం ఉంటుంది. నిజం ఉంటుంది..

ü  ఆయనకి స్నేహితులు ఉండరు, శత్రువులు ఉండరు. ఆయన చుట్టూ అప్పుడు ఉండే మనుషుల్ని ఒక్కోకరిని ఒక్కో తరహాలో హేండిల్ చేస్తుంటారు.

---------------------- మధుర శ్రీధర్ గారు   ------------------

ü  తాగుడు మనిషిని ఎలా తనకు బానిస చేసుకుంటుందో వర్మ కుడా అంతే, తనకు సన్నిహితమైన వాళ్ళందర్ని తనకు బానిసలుగా చేసుకుంటారు.

ü  'శివ' సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు అంతా నిశబ్దం. అద్బుతమైన వింతను ఏదో చూసిన అనుభూతి అందరిలో. నాకు మాత్రం 'శివ' గురించి ఆలోచనలతో పిచ్చెక్కి పోయింది. రెండోసారి..మూడోసారి, నాలుగోసారి...40వసారి...'శివ' చూస్తూనే ఉన్నాను. సినిమా పిచ్చిలో పడి బంగారంలాంటి నా జీవితం సర్వనాసనం చేసుకుంటున్నానని మా ఫ్యామిలీ సర్కిల్ లో దాదాపుగా అందరు ఫిక్స్ అయిపోయారు. కాని ఎప్పటికైనా RGV లాగ డైరెక్టర్ కావాల్సిందే అని నేను ఫిక్షైపొయాను.

ü  జోహన్సబెర్గ్ స్టాక్ ఎక్ష్చంగెలొ సిస్టం అనలిస్ట్ పని చేస్తున్నప్పుడు, ఆఫీసు కి సెలవుపెట్టి వెయ్యి కిలోమీటర్లు దూరం వెళ్లి కేప టౌన్ లో RGV ని దూరంగా చూసి వచ్చాను. కాన్ఫిడెన్సు  లెవెల్స్ ఇంకా  పెరిగాయి.

ü  రామ్ గోపాల్ వర్మ ఈజ్ మై హీరో .

ü  సినిమా ఇండస్ట్రీ తో పరిచెయాల కోసం వీడియో లైబ్రరీ ఓపెన్ చేసానని RGV ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. వెంటనే నేను ముందు ఎనుక ఆలోచించకుండా ఆడియో కంపెనీ స్టార్ట్ చేసాను. RGV కి దగ్గరవ్వాలని 'జేమ్స్' ఆడియో రైట్స్ కొన్నాను.

ü  మధుర ఆడియో ద్వారా సినిమా ఇండస్ట్రీ కి దగ్గరయ్యాక తెలిసింది నాలాంటి రామ్ గోపాల్ వర్మ  బాధితులు  ఇండస్ట్రీ లో కుప్పల తెప్పలుగా ఉన్నారని.

ü  డైరెక్టర్ కు కావాల్సింది ఊహాశక్తి తప్ప, అనుభవం కాదన్న RGV ఇచ్చిన కాన్ఫిడెన్సు తో నా సాఫ్ట్వేర్ జాబు వదిలేసి, జీవితంలో కనీసం షూటింగ్ కుడా చూడని నేను 'స్నేహగీతం' తో దర్శకుడిగా మారాను.

ü  ఒక దర్శకుడిగా ఒక జీవిత కాలానికి సరిపడే ప్రేరణ RGV ఇచ్చాడు. ఇస్తూనే ఉన్నాడు. సునాయాసంగా మరో 50 సినిమాలు తీసేందుకు సరిపోయేంత స్ఫూర్తి, ప్రేరణ నాలో ఉన్నాయి. అందుకు RGV ప్రేరణతో జీవితాలను సర్వనాసనం చేసుకోడానికి ఫిల్మనగర్ చేరుకున్న వందలాది మంది RGV అభిమానుల తరపున RGV కి ఒక బిగ్ సెల్యూట్!!! & చీర్స్!!!

------------- హరీష్ శంకర్ గారు ---------------------------------

ü  24 గంటల్లో 25 గంటలు సినిమా  గురించి మాట్లాడే ఏకైక జీవి RGV

ü  RGV ని వినడం తప్ప చెప్పడం అంత రసవత్తరంగా ఉండదు

ü  అమీబా నుంచి అణుబాంబు వరకు మాట్లాడి  చివరికి అమ్మాయితో ఫినిష్ చేసే సత్త ఉన్న వ్యక్తితో మనం ఎంత ఎక్కువ మాట్లాడితే అంత దొరికేస్తం..

ü  కామెడీ ని  అయిన, కాంట్రావేర్సి ని  అయిన, నిర్మొహమాటాన్నైన, నిశబ్ధాన్నైన ఆయన లాగ ఎంజాయ్ చేయటం ఇంకెవ్వరి వళ్ళ  కాదు.

ü  ఇండస్ట్రీకి వచ్చి నేర్చుకోటానికి తెవలని మాలాంటి వాళ్లకు ఇండస్ట్రీ కే ఎన్నో నేర్పే ఆయన దేవుడు లాంటోడు మరి.

ü  ఆయనలాగా బతకాలనేది ఒక కల. ఆయనలాగా బతకడం ఒక కళ

-------------- తనికెళ్ళ భరణి గారు  -------------------------

ü  RGV అంటే  'సుఖ' జీవి.

ü  సైకోనా పాడా!! వేర్రిబాగులాడు..(వెర్రిని బాగు చేసే వాడు కుడా)

ü  అతనేవ్వరిని వాడుకోడు.మనకి మనంగానే వాడబడుతాం.

----------------------  దేవా కట్ట గారు --------------------

ü  RGV గారి ప్రభావం తన సినిమాలతోనే కాదు, ఆడే ప్రతి మాట తోటి చేసే ప్రతి ట్వీట్ తోటి కుడా.

ü  ఫెల్యూర్స్ వస్తున్నా ప్రయోగాలు చేయాలంటే దమ్ము ఉండాలి. మనం చూసే ప్రపంచ రూపు రేకలని మార్చిన వాళ్ళంతా కోవకి చెందిన వాళ్ళే. ఓటమిని అరికాళ్ళ కింద తొక్కుతూ గెలిచిన వాళ్ళే. భారతీయ చలనచిత్ర చరిత్రలో RGV అటువంటి ఒక 'గెలుపు'.

ü  తను ఒక ఆలోచనలోనో, ఆశ్చర్యంలోనో,ప్రయోగంలోనో మునిగిపోయి ఉండడం..తన మాటలు వినడం వినేవాడి అదృష్టం.

ü  జీవితంలోని రొటీన్ అంశాలన్నీ పక్కకు నెట్టేసి తానూ ప్రేమించే తన పనిలో మునిగి ఉండే మనిషిని చూడడం నిజంగా మేస్మరైజింగ్.

ü  రాము ఒక సీరియల్ కిల్లర్ అయిన, డేకాయిట్ అయిన , గ్యాంగ్స్టర్  అయిన ట్విట్టర్ లో  ఇప్పుడునంత మంది ఫాలోయర్స్ ఉండేవారు. తోని మొటాన అన్నట్టు, రాము 'రాంగ్ అయిన రైటే'

ü  తనని తానూ మోసం చేసుకోనంత వరకు రాము కోవకే చెందుతాడు ప్రతి మనిషి.

----------------------  బి వి ఎస్  రవి గారు -----------------------

ü  365 రోజులు 24 గంటలు ఒకే పని మీద వుండే వాడిని యోగి అంటే, ఒక్క సినిమానే మాట్లాడే వాడిని వర్మ అంటాం.

ü  ఆయన రోజు రాసిన బెస్ట్ సీన్, తీసిన బెస్ట్ షాట్, తెలుసుకున్న బెస్ట్ క్నోలేడ్జ్, కలుసుకున్న బెస్ట్ మనిషి గురించి చెబుతుంటే అందరం తొందరగా కోల్పోయే చిన్న తనపు క్యురియాసిటి  అండ్ సెర్ప్రైసింగ్ నేచర్ ఇంతకాలం ఎలా  కపాడుకోగలిగాడ అని ఆశ్చర్యం వేస్తుంది.

ü  వర్మది వాగుడు కాదు వాధన. అహంకారానికి, దిశనహంకరానికి మధ్య శోధన.  తాగుడు కాదు. మనం నమ్మే తాత్కాలిక నిజాలోంచి శాశ్వతమైన సత్యాల్లోకి కదలిక. బాధలు, బాదరబందిలకి అత్తీతమైన ఆనందం వర్మకి దాసోహం.

ü  వర్మలో చెడు చాల ఎక్కువ. నిలబెట్టి అడిగేస్తాడెమిటొ. నిలదీసి నిజం లాగుతాడు ఎందుకో. నిర్లజ్జగా తప్పులు ఒప్పుకుంటాడు  ఏంటి? అబద్దపు దుప్పటిని అవతలకి నెట్టేస్తాడు.

ü  వర్మ అందుకున్న విజయాల తాలూకు రహస్యాలను వెల్లడిస్తూ తానూ చాల మామూలు మనిషినని ఒప్పుకుంటాడు.

ü  వర్మకు విమర్శా సహించదు...తీసుకోడు... ఆయనది ఆత్మవిమర్స.

ü  హిట్స్ కోసం, డబ్బు కోసం కాదు కదా ఇతనికి సినిమాల పిచ్చి పట్టింది. అతను అర్ధం చేసుకున్న మానవ సంబంధాల్ని సమస్యల్ని,ఆవేశాల్ని ప్రెసెంట్ చేయడానికి ఎంచుకున్న మార్గం సినిమా అయినప్పుడు ఇంకా జయాపజయాల బేధం ఏముంది?

ü  ఎవరీ సిప్ అఫ్ వోడ్కా లో సినిమానే నంచుకునే వర్మ!!

----------------------- సిరా శ్రీ గారు  -------------------------

ü  1989 నుంచి భారతీయ చలన చిత్ర సీమలో న్యూసెన్స్ కి , న్యూ సెన్స్ కి  కేరాఫ్ అడ్రస్ అయన.

ü  అతని సినిమాల ద్వారా అందరికి తెలిసిన వాడు రీల్ వర్మ. మీడియాలో అతని ధోరణి చూసిన వాళ్లకి తెలిసేది మీడియా వర్మ. వ్యక్తిగతంగా అతనిని దగ్గర నుంచి పరిశీలించే వారికి కనిపించేది రియల్ వర్మ.

ü  స్వేచ్చను వర్మ యదేచ్చగా పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తారు. తన భావాల వ్యక్తీకరణకు భాషనూ అడ్డగోలుగా వాడేసుకుంటారు. పరిమితులనేవి ఆయనకు పట్టనే పట్టవు.

ü  వర్మ జీవితం ముగిసేలోపు ఇటువంటి(వోడ్కా విత్ వర్మ) పుస్తకాలు ఇంకా అనేకం వస్తాయి.ముగిసాక కుడా  మరెన్నో పుస్తకాలు రావడం ఖాయం.

వాస్తవానికి వోడ్కా విత్ వర్మ  పుస్తకంలో ఉన్న 29 పెగ్స్ లోని ప్రతి (అక్షరం) చుక్క కిక్ ఇస్తుంది.అందుకే చీర్స్, బొటొమ్స్ అప్ లో ని కొన్ని మాటలను మాత్రమె ఇక్కడ వాడుకున్న. 
-----------------------------------------------------------

ఇలా ఎంతోమందిని ఆయన్ని ఆరాదించే వారిగా, అభిమానులుగా, భక్తులిగా, బానిసలుగా చేసుకున్న ఆయని వ్యక్తిత్వాన్ని, జీవన విధానాన్ని తెలుసుకోవాలనే కుతూహలం ఎవ్వరకి ఉండదు చెప్పండి.
నాకు ఆయన గురించి తెలిసే కొద్ది ఆయన గురించి తెలుసుకోవలసింది పెరుగుతూనే వస్తుంది.
ఇలా ఎంతో మంది ఆలోచనలని, ఆశలని, ఆత్రుతని, భలాన్ని, భావోద్వేగాల్ని ఆయన చుట్టూ తిప్పుకుంటూ అలా తిప్పుకుంటుంది బయటకు కనబడే నేను కాదు నాలో రెండు భాగాలుగా నిస్క్లిప్థమై ఉన్న ఎందరో మనుషుల, సంఘటనల, పుస్తకాల అనుభవాలు మాత్రమె అని చెబుతుంటే, ఇంతగా  ఆరాదిస్తున్న ఆయని గొప్పతనాన్ని ఇంకొకరికి ఆపాదించటం లో ఆయని ఆంతర్యం ఆయని నిజాయితే  నా???  ఆయని అసలు ఉద్దేశం ఏమిటో నాకు తెలియదు కాని అయన చెబుతున్నది నాకు ఎలా అర్ధం అవుతుంది అంటే ఆయన నేను పుట్టుకతో మీలాంటి ఒక సమాన్యుడినే, కాకపోతే నాకు ఎదురైనా ప్రతి వ్యక్తి అనుభవాల నుంచి  నాకు నచ్చినవి నేను తీసుకొని నావి చేసుకొని ఇలా నేను నేనైనాను, ప్రయత్నిస్తే మీరూ అవ్వొచ్చు అని మనకి చెప్పటానికే అయ్యివుండవచ్చు!!.

ఇంతకి ఆయన ఏమంటున్నారు అంటే....
"ఒక మనిషిని చుట్టూ ఉన్న పరిస్థితులే తయారు చేస్తాయి" అని  కారల్ మార్క్స్ చెప్పారు,ఆయన చెప్పినట్టే నా జీవితంలో కుడా కొందరు మనుషులు, కొన్ని పుస్తకాలు, కొన్ని సంఘటనలు ఇలా నా జీవితంలో ఎదురైనా ప్రతి వ్యక్తి అనుభవాల నుంచి నాకు నచ్చినవి నేను తీసుకొని నావి చేసుకున్నవి నా జీవితంలో రెండు భాగాలుగా ఉండటమ వల్ల ఇలా నేను నేనైనాను, నేను "నా" లా మిగిలాను. నా ఇష్టం వచ్చినట్టు బ్రతికాను, బ్రతుకుతున్నాను, బ్రతకబోతున్నాను. - RGV

రాము గారి మొదటి భాగం :

ü  Ayn Rand

ü  FRIEDRICH NIETZSCHE  

ü  ardhar shapen hoper,

ü  ఆయని విజయవాడ ఫ్రెండ్ సత్యేంద్ర,

ü  james haadli chej,

ü  fredrik forseth,

ü  ముప్పాళ్ళ రంగనాయకమ్మ

ü  మ్యాడ్ మ్యగ్జిన్లు ,

ü  సెక్స్ పుస్తకాలు,

ü  చందమామ కథలు,

ü  బాలమిత్ర కథలు;

ü  Steven Spielberg,

ü  K.Balachander.

 రాము  గారి రెండో భాగం :

ü  మంచి స్టూడెంట్ కాకపోవటం,

ü  నా ఇష్టమొచ్చినట్టు చేసుకోవటానికి అనుమతిచ్చిన నాన్న ఉండటం,

ü  ఏడేళ్ళు విజయవాడ వీధుల్లో వీరంగం చేయటం,

ü  నన్ను ఒక సినిమా ఉన్మాదిని చేసిన ప్రసాద్ మామయ్యా,

ü  సినిమాల గురించి విశ్లేషణ అలవాటు చేసిన మురళి మామయ్యా

లాంటి వాళ్ళు నా జీవితంలో తారస పడటం మూలాన నేను నేనైనాను, నేను "నా" లా మిగిలాను. నా ఇష్టం వచ్చినట్టు బ్రతికాను, బ్రతుకుతున్నాను, బ్రతకపోతున్నాను అని రాము గారు చెబుతున్నారు.

నేను వాస్తవంగా కొన్ని కే.బాలచందర్ గారి, స్టీవెన్ స్పెఇల్బుర్గ్ గారి సినిమాలు చూసాను, కొన్ని సెక్స్, చందమామ, బాలమిత్ర కథల పుస్తకాలు చదివాను. రాము గారు చెప్పిన మిగతావారి పేర్లు ఆయన నా ఇష్టం పుస్తకం చదివిన తర్వాతా నాకు తెలిసినవి. అప్పుడు ది ఫౌంటెన్ హెడ్ పుస్తకం చదివాను, పుస్తకం లో ఉన్న రక రకాల వ్యక్తిత్వాలు రాము గారి రూపం లో కనపడ్డాయి. నాకు అప్పుడు అర్ధం అయ్యింది ఏంటి అంటే, రాము గారి కి ఉన్న కొన్ని లక్షణాలు అయన్ రాండ్ లో కూడా ఉండి ఉంటాయి, అందుకే ఆమెను బాగా చదివారు అని.  రాము గారు చెప్పినట్టు, ఆయన ఆయనకు నచ్చినవి మాత్రమె తీసుకొని ఉంటారు, వరకు నేను కూడా రాము గారిలో నాకు నచ్చినవి, అర్ధం అయ్యినవి మాత్రమె తీసుకుంటాను/తీసుకోగలను అని నేను అనుకుంటున్నాను. నేను ఎంత రాము గారిని నుంచి తీసుకుంటాను అనేది కేవలం అది నా ఆలోచన శక్తీ, ఆసక్తి మీద ఆధార పడి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను!!

నాకు ఒక చిన్న కోరిక, రాము గారు ఆయన రెండు భాగాలకు కారణమైన మనుషులు, పుస్తకాలు, సంఘటనల గురించి వివరించే పుస్తకం రాస్తే బాగుంటుంది అని.